Header Banner

విదేశాల్లో చదువుతున్న వారికి అదిరిపోయే వార్త! ఇకపై అన్ని లక్ష‌ల‌ వరకు పన్ను ఉండదు.. ప్రభుత్వం కీలక ప్రకటన!

  Sun Feb 02, 2025 17:06        Politics

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అందులో రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్నవారికి ప‌న్ను మిన‌హాయింపు కూడా ఒక‌టి. ఐతే, ఈ బ‌డ్జెట్ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అదే.. విదేశాల‌కు పంపించే డబ్బుపై ట్యాక్స్ మిన‌హాయింపు ఇవ్వ‌డం. మ‌న దేశం నుంచి.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల‌కు చ‌దువు, ఉద్యోగం కోసం వెళ్తూ ఉంటారు. వారికి మ‌న దేశం నుంచి డ‌బ్బు పంపుతూ ఉంటారు. ఐతే కేంద్ర బ‌డ్జెట్‌లో ఈ వ‌ర్గానికి భారీ ఊరట ల‌భించింది. ప్రయాణాలు, వైద్య ఖర్చులు, పెట్టుబడుల నిమిత్తం భారత్‌ నుంచి విదేశాలకు పంపే డబ్బులపై మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) చేసే పరిమితిని పెంచారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి డబ్బులు పంపితేనే ఇక నుంచి టీసీఎస్‌ ఉంటుంది.

 

ఇంకా చదవండి: బైరెడ్డిపల్లిలో RMP వైద్యం పేరుతో ఘోరం.. 10 ఏళ్ల బాలిక మృతి! విచారణకు DMHO రంగంలోకి!

 

ఇంతకుముందు ఈ పరిమితి రూ.7 లక్షలుగా ఉంది. ఇప్పుడు ఈ పరిమితిని పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. విదేశాలకు పంపించే చిన్న మొత్తం లావాదేవీలకు పన్ను భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి పంపితే.. ఆ డబ్బులు ఏ అవసరానికి పంపించారో, వాటి ఆధారంగా టీసీఎస్‌ రేట్లు వర్తిస్తాయి. వైద్య అవసరాల కోసమైతే 5%, విదేశీ పెట్టుబడులు, ప్రయాణాలకైతే 20 శాతంగా ఇవి ఉండనున్నాయి. విద్యా అవసరాల కోసం పంపించే నిధులకు టీసీఎస్‌ తీసేశారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న లేదా నిర్వహిస్తున్న దేశీయ సంస్థకు సేవలు అందిస్తున్న ప్రవాస భారతీయుల కోసం ఊహాత్మక (ప్రిజంప్టివ్‌) పన్ను విధానాన్ని కూడా ప్రతిపాదించారు.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AbroadStudies #India #Government #Incometax